H-1B Visas: వారికి మరో అవకాశం.. రెండోసారి లాటరీ పద్ధతిలో ఎన్నిక

ఈ ఏడాది హెచ్‌-1బి వీసాల ర్యాండమ్ ఎంపికలో అవకాశం దక్కని వారికి అమెరికా మరో అవకాశం కల్పించనుంది. దరఖాస్తుదారుల కోసం రెండో లాటరీ తీయనున్నట్లు....

Published : 30 Jul 2021 15:51 IST

వాషింగ్టన్‌: ఈ ఏడాది హెచ్‌-1బి వీసాల ర్యాండమ్ ఎంపికలో అవకాశం దక్కని వారికి అమెరికా మరో అవకాశం కల్పించనుంది. దరఖాస్తుదారుల కోసం రెండో లాటరీ తీయనున్నట్లు అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్‌) ప్రకటించింది. ఈ ఏడాది మొదట్లో నిర్వహించిన కంప్యూటరైజ్డ్‌ డ్రాలో సరిపడినన్ని వీసాలు జారీ చేయని కారణంగా మరోసారి లాటరీ తీయాలని నిర్ణయించినట్లు యూఎస్‌సీఐఎస్‌ తెలిపింది. ఫలితంగా హెచ్‌-బి వీసాల కోసం ఎదురుచూస్తున్న వందలాది భారతీయ ఐటీ ఉద్యోగులకు మరో అవకాశం దక్కనుంది.

ఇప్పటికే సమర్పించిన ఎలక్ట్రానిక్‌ రిజిస్ట్రేషన్లను ఈనెల 28న ర్యాండమ్ పద్ధతిలో ఎంపిక చేసినట్లు అమెరికా ఇమ్మిగ్రేషన్ సేవల సంస్థ వెల్లడించింది. ఈనెల 28న ఎంపిక చేసిన రిజిస్ట్రేషన్లకు సంబంధించిన పిటిషన్ ఫైలింగ్ గడువు ఆగస్టు 2వ తేదీన ప్రారంభమై, నవంబర్ 3న ముగియనుంది. హెచ్‌-1బి పిటిషన్ల కోసం ఆన్‌లైన్ ఫైలింగ్ అందుబాటులో లేదు. దరఖాస్తుదారులు కాగితం ద్వారానే ఈ ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని