ఇది కూడా దేవుడికే వదిలేద్దామా?

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్, చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై కేంద్రం మీద తన విమర్శల పర్వాన్ని కొనసాగించారు.

Published : 11 Sep 2020 11:32 IST

చైనా దురాక్రమణపై రాహుల్ వ్యాఖ్య

దిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్, చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై కేంద్రం మీద తన విమర్శల పర్వాన్ని కొనసాగించారు.  జీఎస్టీ మండలి సమావేశంలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యను ప్రస్తావిస్తూ ఎద్దేవా చేశారు. లద్దాఖ్‌‌ ప్రాంతంలో చైనా దురాక్రమణను కూడా ప్రభుత్వం దైవ ఘటనగానే భావిస్తుందా? అంటూ శుక్రవారం ట్విటర్ వేదికగా మండిపడ్డారు. ‘చైనా మన భూభాగాన్ని ఆక్రమించింది. భారత ప్రభుత్వం ఎప్పుడు దాన్ని వెనక్కి తీసుకురాగలుగుతుంది? లేకపోతే దీన్ని ‘దైవ ఘటన’ ఖాతాలోకి చేరుస్తారా?’ అని ట్వీట్  చేశారు. 

ఇటీవల జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో ఆర్థిక మంత్రి మాట్లాడుతూ..జీఎస్టీ వసూళ్లపై కరోనా వైరస్‌ ప్రభావం చూపిందని, దాని కారణంగా 2021 ఆర్థిక సంవత్సరంలో రూ.2.35లక్షల కోట్ల మేర లోటు ఏర్పడిందన్నారు. ఆ సందర్భంలోనే ఆమె ‘దైవ ఘటన’ పదాన్ని వాడారు. దీనిపై అప్పట్లో కాంగ్రెస్ విమర్శలు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని