కొడాలిపై పోలీసులకు సోము వీర్రాజు ఫిర్యాదు

హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మంత్రి కొడాలి నానిపై రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల భాజపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు స్థానిక పోలీసులకు వారు ఫిర్యాదు చేశారు. హిందువుల మనోభావాలను మంత్రి ....

Updated : 21 Sep 2020 19:48 IST

విజయవాడ: హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మంత్రి కొడాలి నానిపై రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల భాజపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు స్థానిక పోలీసులకు వారు ఫిర్యాదు చేశారు. హిందువుల మనోభావాలను మంత్రి కించపరిచారంటూ మండిపడ్డారు. విజయవాడలోని మాచవరం పోలీస్‌స్టేషన్‌లో కొడాలి నానిపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తితిదేలో అన్యమతస్థులు డిక్లరేషన్‌ ఇచ్చే అంశం ఎప్పటి నుంచో అమల్లో ఉందన్నారు. దేశంలోని హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా మంత్రి వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. దేవుని విగ్రహాలను బొమ్మలుగా వ్యాఖ్యానించడం భక్తుల విశ్వాసాలను దెబ్బతీసినట్లేనని సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని