మంత్రి తలసానికి నిరసన సెగ

వరద బాధితులను పరామర్శించేందుకు వచ్చిన మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌కు నిరసన సెగ తగిలింది. గోషామహల్‌ నియోజకవర్గం

Published : 24 Oct 2020 02:13 IST

హైదరాబాద్‌: వరద బాధితులను పరామర్శించేందుకు వచ్చిన మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌కు నిరసన సెగ తగిలింది. గోషామహల్‌ నియోజకవర్గం అబిడ్స్‌ చీరగ్‌ గల్లీలోని నేతాజీ నగర్‌లో వరద బాధితులకు చెక్కులు పంపిణీ చేసేందుకు స్థానిక భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌తో కలిసి మంత్రి వెళ్లారు. అక్కడి సమస్యలను మంత్రికి చెప్పుకునేందుకు వచ్చిన స్థానిక భాజపా నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నాయకులు ఆందోళనకు దిగి ప్రభుత్వానికి, మంత్రి తలసానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చెక్కులను తెరాస కార్యకర్తలకే ఇస్తున్నారని.. బాధితులకు ప్రభుత్వ సాయం అందడం లేదని స్థానిక మహిళలు ఆరోపించారు. బస్తీ కమిటీ నిర్ణయం మేరకు బాధితులందరికీ చెక్కులను అందిస్తామని మంత్రి తలసాని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే రాజాసింగ్‌, స్థానిక కార్పొరేటర్ మమత సంతోష్‌ గుప్తతో కలిసి వరద బాధితులకు రూ.10వేల ఆర్థిక సాయాన్ని మంత్రి అందించారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని