తెరాస నన్ను మర్చిపోయింది: డీఎస్‌

నగరాన్ని అభివృద్ధి చేస్తామనే కమిట్‌మెంట్‌ ఇచ్చేవారికే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటు వేయాలని రాజ్యసభ ఎంపీ డి.శ్రీనివాస్‌ (డీఎస్‌) అన్నారు

Updated : 23 Dec 2022 12:26 IST

హైదరాబాద్‌: నగరాన్ని అభివృద్ధి చేస్తామనే కమిట్‌మెంట్‌ ఇచ్చేవారికే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటు వేయాలని రాజ్యసభ ఎంపీ డి.శ్రీనివాస్‌ (డీఎస్‌) అన్నారు. గ్రేటర్‌ ఎన్నికలు జిమ్మిక్కుగా చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.  జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ప్రజాస్వామ్య బద్ధంగా జరగాలన్నారు.  హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల్లో తెరాస విశ్వసనీయత పెంచుకోవాలన్నారు.  హైదరాబాద్‌లో రూ.68వేల కోట్లతో చేసిన అభివృద్ధి ఎక్కడ కనిపిస్తోందని డీఎస్‌ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ హయాంలో ఫ్లైఓవర్లు నిర్మించారని.. ఇప్పుడు వాటి నిర్వహణ కూడా సరిగా చేయడం లేదని విమర్శించారు. 

కేసీఆర్‌ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని.. ఆయన రాష్ట్రం కంటే కేంద్రం గురించే ఆలోచన చే స్తారని డీఎస్‌ ఎద్దేవా చేశారు.   కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు నియోజకవర్గాలకు దుబ్బాక ఆనుకుని ఉంటుందని.. ఇటీవల జరిగిన ఉపఎన్నికలో అక్కడి ప్రజల నిర్ణయం చూశామన్నారు. తెరాస పనిచేస్తే ప్రజల్లో వ్యతిరేకత ఎందుకు వస్తోందని ప్రశ్నించారు. తెరాస తనను మర్చిపోయిందని ఓ ప్రశ్నకు సమాధానంగా డీఎస్‌ వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని