మాకు ఎవరితోనూ పొత్తు లేదు: అసదుద్దీన్

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు కుదుర్చుకోలేదని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ

Published : 23 Nov 2020 00:39 IST

హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు కుదుర్చుకోలేదని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో పాదయాత్ర చేస్తూ అసదుద్దీన్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసే అభ్యర్థులను ఎన్నుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. భాజపాతో ఎంఐఎం కలిసిందని రాష్ట్ర మంత్రి జగదీష్‌రెడ్డి ఓ వైపు.. తెరాసతో పొత్తు పెట్టుకున్నామని కాంగ్రెస్‌ నేతలు మరోవైపు చేస్తున్న ఆరోపణలు ఆశ్చర్యాన్ని కలిగించాయన్నారు. గ్రేటర్‌ పోరులో ఇతర పార్టీలతో ఎలాంటి పొత్తు లేకుండా 52 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు అసదుద్దీన్‌ స్పష్టం చేశారు.

2019 ఎన్నికల తర్వాత రాష్ట్రానికి, ప్రత్యేకంగా హైదరాబాద్‌కు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిధులు కేటాయించలేదని.. అందుకే అభివృద్ధి గురించి చెప్పుకొనే పరిస్థితి లేక ఎన్నికలకు మతం రంగులు పులుముతున్నారని అసదుద్దీన్ ఆక్షేపించారు. పశ్చిమ్‌ బంగాలో రాబోయే ఎన్నికల్లో తాము పోటీ చేయాలా? వద్దా? అనే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. అక్కడి పార్టీ ప్రతినిధులతో మాట్లాడిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. కరోనా కారణంగా నిరుద్యోగులుగా మారిన లక్షలాది మందికి భరోసా కల్పించకుండా విద్వేషాలను రెచ్చగొడుతున్నారని అసదుద్దీన్‌ విమర్శించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని