Soyam bapurao: పార్టీ మార్పుపై ఎంపీ సోయం బాపూరావు రియాక్షన్ ఇదే!

తాను కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఆదిలాబాద్‌ భాజపా ఎంపీ సోయంబాపూరావు ఖండించారు. ఈ ప్రచారం వెనుక భారాస హస్తం ఉందని ఆయన ఆరోపించారు.

Updated : 16 May 2023 16:16 IST

హైదరాబాద్‌: తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారాన్ని భాజపా నేత, ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపూరావు ఖండించారు. కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అర్థం లేని ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. ‘‘ఈ నెల 27న నా కుమారుడి పెళ్లి ఉంది. పెళ్లి కార్డులు అన్ని పార్టీల వారికీ ఇస్తాం. పార్టీలకు అతీతంగా నేతలందర్నీ పిలుస్తున్నాను. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్‌, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి సైతం పెళ్లి పత్రిక ఇస్తాను. గతంలో కాంగ్రెస్‌ కీలక నేతగా ఉన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డిని భాజపాలోకి నేనే ఆహ్వానించా. ఆయనతో ఎలాంటి విభేదాలు లేవు’’ అని బాపూరావు తెలిపారు. తనపై వస్తున్న తప్పుడు ప్రచారం వెనుక భారాస హస్తం ఉందన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ గెలిచినంత మాత్రాన దేశమంతా గెలిచినట్లు కాదని వ్యాఖ్యానించారు. అక్కడ భాజపా పరాజయం పాలైనప్పటికీ ఓట్ల శాతం మాత్రం తగ్గలేదని సోయం బాపూరావు గుర్తు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు