Botsa Satyanarayana: ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ వాహనాన్ని అడ్డగించిన అంగన్వాడీలు

విజయనగరం జిల్లాలోని గజపతినగరం జాతీయ రహదారిపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వాహనాన్ని అంగన్వాడీలు సోమవారం అడ్డుకున్నారు.

Updated : 08 Jan 2024 16:34 IST

గజపతినగరం: విజయనగరం జిల్లాలోని గజపతినగరం జాతీయ రహదారిపై ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రయాణిస్తున్న వాహనాన్ని అంగన్వాడీలు సోమవారం అడ్డగించారు. తమ సమస్యలను పరిష్కరించాలని.. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని మంత్రిని కోరారు. చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. శాంతియుతంగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై ‘ఎస్మా’ ప్రయోగించడాన్ని వారు తీవ్రంగా తప్పుబట్టారు.

అంగన్వాడీల వినతిపై మంత్రి స్పందిస్తూ.. వేతనాల పెంపు మినహా మిగిలిన సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తెలంగాణ కంటే అధికంగానే వేతనాలు ఇస్తున్నామన్నారు. బాలింతలు, గర్భిణులు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం వివరించినా.. సమ్మె విరమించకపోవడం వల్లే ఎస్మా ప్రయోగించాల్సి వచ్చిందన్నారు. సమ్మెను విరమించిన మరుక్షణమే ఎస్మా రద్దు చేస్తామని మంత్రి వెల్లడించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని