CM Jagan: కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణపై గవర్నర్‌తో చర్చించిన సీఎం

రాజ్‌భవన్‌లో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో సీఎం జగన్‌ అరగంటకు పైగా భేటీ అయ్యారు. మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణ చేయనున్న దృష్ట్యా ప్రస్తుత మంత్రులందరితో

Updated : 06 Apr 2022 20:31 IST

విజయవాడ: రాజ్‌భవన్‌లో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో సీఎం జగన్‌ అరగంటకు పైగా భేటీ అయ్యారు. మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణ చేయనున్న దృష్ట్యా ప్రస్తుత మంత్రులందరితో రాజీనామాలు తీసుకునే అంశంపై సీఎం జగన్‌ చర్చించినట్టు తెలుస్తోంది. కొత్త మంత్రివర్గంలోకి తీసుకునే వారి వివరాలు వెల్లడించినట్టు సమాచారం. ఈనెల 11న కొత్త కేబినెట్‌ ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై కూడా సీఎం.. గవర్న్‌కు వివరించారని తెలుస్తోంది. కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణ నేపథ్యంలో రేపు సచివాలయంలో మంత్రివర్గం చివరిసారి సమావేశం కానుంది.

మంత్రులుగా ఎవరెవరిని కొనసాగించాలి, ఎవరికి కొత్తగా అమాత్య పదవి ఇవ్వాలనే అంశంపై ఇప్పటికే సీఎం జగన్‌ కసరత్తు పూర్తి చేశారు. ముఖ్యమంత్రి అభీష్టం మేరకు మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉండటంతో ఈమేరకు ప్రాంతాలు, సామాజిక వర్గాలు, పార్టీకి అందించిన సేవలను ప్రాధాన్యతగా తీసుకుని కొత్త మంత్రులను ఎంపిక చేశారు. ఎంపిక చేసిన ప్రాథమిక  జాబితాను గవర్నర్‌కు సీఎం జగన్‌ సమర్పించినట్టు తెలిసింది. రాష్ట్రంలో కొత్తగా 26 జిల్లాలను ఏర్పాటు చేశారు. మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణలో జిల్లాకు ఓ మంత్రిని నియమించనున్నట్టు ఇప్పటికే సీఎం ప్రకటించారు. జిల్లాల వారీగా ఎవరెవరికి మంత్రిగా అవకాశం ఇవ్వాల్సి వచ్చింది, వారి అర్హతలేమిటి, సామాజిక వర్గం పరంగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎందుకొచ్చింది.. తదితర అంశాలపై గవర్నర్‌తో సీఎం చర్చించారు. వీటితో పాటు జిల్లాల పునర్విభజన అంశాల విషయంలో తీసుకున్న ప్రాధాన్యతలు, ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న వైనం, జిల్లాల పేర్లు తదితర అంశాలపై గవర్నర్‌తో సీఎం జగన్‌ చర్చించినట్టు తెలిసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని