పరిషత్‌ ఎన్నికలపై కాసేపట్లో హైకోర్టు తీర్పు

రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను నిలిపేస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) కార్యదర్శి కన్నబాబు ధర్మాసనం ముందు..

Updated : 07 Apr 2021 16:14 IST

అమరావతి: ఏపీలో పరిషత్‌ ఎన్నికల నిర్వహణపై రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను నిలిపేస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) కార్యదర్శి కన్నబాబు ధర్మాసనం ముందు అప్పీల్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టులో డివిజన్‌ బెంచ్‌ ఎదుట వాదనలు ముగిశాయి. దీనిపై కాసేపట్లో డివిజన్‌ బెంచ్‌ తీర్పు వెలువరించనుంది. హైకోర్టు తీర్పుపై రాష్ట్రవ్యాప్తంగా అధికార యంత్రాంగం ఎదురుచూస్తోంది.

ఎస్‌ఈసీ తరపున సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపించారు. వర్ల రామయ్య తెదేపా తరఫున పిటిషన్‌ వేయలేదని, వ్యక్తిగతంగా రిట్‌ పిటిషన్‌ వేయకూడదని సీవీ మోహన్‌రెడ్డి ధర్మాసనం దృష్టికి తెచ్చారు. 28 రోజులు కోడ్‌ ఉండాలనేది సుప్రీం ప్రత్యేక సందర్భంలో ఇచ్చిందని పేర్కొన్నారు. కోడ్‌ నిబంధన ఈ ఎన్నికలకు వర్తింప జేయాల్సిన అవసరం లేదన్నారు. పిటిషన్‌లో సరైన వివరాలు లేవని ఎస్‌ఈసీపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. సరైన పేపర్లతో మధ్యాహ్నం 12 గంటలకు కోర్టు ముందుకు రావాలని ఎస్‌ఈసీ తరఫు న్యాయవాదికి ధర్మాసనం ఆదేశించింది. మధ్యాహ్నం 12గంటలకు మరోసారి వాదనలు విన్న ధర్మాసనం మధ్యాహ్నం తీర్పు వెల్లడించనున్నట్టు తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని