చిక్కు ముడులు విప్పుతున్నాం: బుగ్గన

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జలవనరులశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో ఏపీ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, అనిల్‌ కుమార్‌ యాదవ్‌ శుక్రవారం దిల్లీలో సమావేశమయ్యారు.

Published : 12 Dec 2020 01:32 IST

దిల్లీ : రాష్ట్రానికి న్యాయపరంగా రావాల్సిన నిధులపై కేంద్రమంత్రులను కలుస్తున్నామని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. తెదేపా ప్రభుత్వం ప్యాకేజీకి ఒప్పుకోవడంతో పోలవరానికి సమస్య వచ్చిందన్నారు. పోలవరం ప్రాజెక్టు అంశంపై దిల్లీలో కేంద్ర జలవనరులశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో రాష్ట్ర మంత్రులు అనిల్‌కుమార్‌ యాదవ్‌, బుగ్గన భేటీ అయ్యారు. అనంతరం మంత్రులిద్దరూ మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం చేసిన తప్పుల చిక్కుముడులను ఒక్కొక్కటిగా విప్పుకుంటూ వస్తున్నామని బుగ్గన అన్నారు. 

మంత్రి అనిల్‌ మాట్లాడుతూ...‘‘ పోలవరం ప్రాజెక్టు నిధుల అంశంపై కేంద్రమంత్రితో చర్చించాం. 2017లో జరిగిన పొరపాట్ల వల్ల పోలవరానికి ఇబ్బందులు ఉన్నాయి. వాటిని కేంద్ర మంత్రికి వివరించాం. వాటిపై అవగాహన ఉందని, ప్రాజెక్టు ముందుకెళ్లేలా  చూస్తామన్నారు. ప్రాజెక్టులో తాగునీటి విభాగాలను తొలగించారు. అవికూడా ఉంచాలని కోరాం. విభజన చట్టంలో పోలవరంపై తాగునీటి అవసరాల అంశం కూడా ఉంది. పరిహారం, పునరావాసంపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించాలని కేంద్రమంత్రిని కోరాం. 15 రోజులలోపే పోలవరం వస్తానని చెప్పారు. అనుకున్న సమయానికే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం’’ అని మంత్రి అనిల్‌ వివరించారు.
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని