Balakrishna: ఎన్టీఆర్‌ అంటే నవరసాలకు అలంకారం: నందమూరి బాలకృష్ణ

ఎన్టీఆర్‌ అంటే నవరసాలకు అలంకారమని ప్రముఖ సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు.

Updated : 18 Jan 2024 11:54 IST

హైదరాబాద్‌: ఎన్టీఆర్‌ అంటే నవరసాలకు అలంకారమని ప్రముఖ సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్‌లో కుటుంబసభ్యులతో కలిసి నివాళులర్పించారు. పేదల సంక్షేమానికి ఎన్టీఆర్‌ అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని బాలకృష్ణ గుర్తుచేసుకున్నారు. నివాళులర్పించిన వారిలో నందమూరి రామకృష్ణ, సుహాసిని తదితరులు ఉన్నారు.

నివాళులర్పించిన నారా భువనేశ్వరి

ఎన్టీఆర్‌కు ఆయన కుమార్తె, తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నివాళులర్పించారు. ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్దకు చేరుకుని అంజలి ఘటించారు. ఆమె వెంట పలువురు తెదేపా నేతలు, కార్యకర్తలు ఉన్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని