Bandi Sanjay: భాజపా ప్రతిష్టను దెబ్బతీసేందుకు సీఎం పన్నాగం: బండి సంజయ్‌

భాజపా ప్రతిష్టను దెబ్బతీసేందుకు సీఎం పన్నిన పన్నాగమే మంత్రి హత్య కుట్ర కేసు అని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా...

Published : 04 Mar 2022 01:55 IST

హైదరాబాద్: భాజపా ప్రతిష్టను దెబ్బతీసేందుకు సీఎం పన్నిన పన్నాగమే మంత్రి హత్య కుట్ర కేసు అని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బండి సంజయ్‌ మాట్లాడుతూ.. అవినీతి మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను కాపాడబోయి తప్పు మీద తప్పులు చేస్తు్న్నారని విమర్శించారు. హత్యా రాజకీయాలను భాజపా సమర్థించదని స్పష్టం చేశారు. రిమాండ్‌ చేయబడ్డ వారే మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారని తెలిపారు.

‘‘సాజిద్‌ ఖాన్‌ అనే తెరాస నాయకుడు 16 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసినా ఇక్కడి పోలీసులు పట్టుకోలేదు. కానీ, ఇక్కడ ఏ తప్పూ చేయని వాళ్లని దిల్లీ వెళ్లి పట్టకొచ్చారు. దిల్లీ పోలీసులకు సమాచారం లేకుండా  అక్కడి నుంచి జితేందర్‌రెడ్డి డ్రైవర్‌ని కూడా తీసుకొచ్చారు. జితేందర్‌రెడ్డి పీఏ దిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆయన పేరు మీద కూడా ఇక్కడ కేసులు పెట్టారు. రిమాండ్‌ రిపోర్టులో భాజపాకి సంబంధం లేదని బయటపడింది. సర్వేలన్నీ భాజపా అంటున్నాయి.. ముఖ్యమంత్రి డిఫ్రెషన్‌లో పడ్డారు. అవినీతి మంత్రులపై సానుభూతి పెంచేందుకే ఈ ఎత్తుగడ. అన్ని విచారణ సంస్థలను ఆశ్రయిస్తాం. ఈ అంశంపై  ఉన్నత స్థాయి విచారణ జరగాల్సిన అవసరం ఉంది. సలహాలు, సూచనల పేరుతో హత్యా రాజకీయాలు ప్రేరేపిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అవినీతిని అడ్డుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసే వాళ్లకు సహాయ.. సహకారాలు అందిస్తాం’’ అని బండి సంజయ్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని