Bandi Sanjay: కేసీఆర్‌ దిల్లీలో ఉండగానే ఈ నాటకానికి రూపకల్పన: బండి సంజయ్‌

తెరాసకు చెందిన ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణలు తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటనపై తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మాట్లాడారు. తెరాస ఒక డ్రామా కంపెనీ అని పేర్కొన్నారు. 

Published : 27 Oct 2022 01:55 IST

హైదరాబాద్‌: తెరాస ఒక డ్రామా కంపెనీ అని తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. తెరాస కట్టు కథలు చూస్తే ప్రజలంతా నవ్వుకుంటారని విమర్శించారు. అధికార తెరాసకు చెందిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు అంశం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో కాక పుట్టిస్తోంది. ఈ ఘటనపై బండి సంజయ్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘తెరాస ఒక పెద్ద డ్రామా కంపెనీ. తెరాస కట్టుకథలు చూస్తే ప్రజలంతా నవ్వుకుంటారు. ఫామ్‌హౌజ్‌లో ఉన్నవాళ్లు భాజపా వాళ్లని ఎవరు చెప్పారు? ఫామ్‌హజ్‌ వాళ్లదే, ఫిర్యాదు చేసింది వాళ్లే. ఒక మంత్రిపై హత్యాయత్నం జరిగిందని గతంలోనూ డ్రామా ఆడారు. బేరసారాలకు ఎక్కడైనా స్వామీజీలు వెళ్తారా? హిందూ ధర్మం అంటే కేసీఆర్‌కు ఎందుకంత కోపం?ఈ ఘటనపై మూడురోజులుగా ఎమ్మెల్యేలు సమావేశమై కుట్ర చేశారు. నలుగురు ఎమ్మెల్యేలను పీఎస్‌కు ఎందుకు తరలించలేదు? వారు నేరుగా ప్రగతిభవన్‌కు ఎలా వెళ్తారు? ఆ నలుగురు ఎమ్మెల్యేలను అర్ధరూపాయికి కూడా ఎవరూ కొనరు. తన పార్టీ ఎమ్మెల్యేలను బెదిరించేందుకే ఈ నాటకమాడారు. ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా చూసుకునేందుకే ఈ నాటకం. కేసీఆర్‌ నాటకమంతా త్వరలోనే బయటపడుతుంది. ఈ నాటకమంతా త్వరలోనే కేసీఆర్‌ మెడకే చుట్టుకుంటుంది. హిందూ సమాజాన్ని కించపరిచేందుకు కేసీఆర్‌ కుట్రపన్నారు. హిందూ సమాజాన్ని కించపరిచేందుకే స్వామిజీని ఇరికించారు. తెరాస ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేయిస్తాం. ఫామ్‌హౌజ్‌ అడ్డగా గుట్కా వ్యాపారం నడుస్తోంది’’ అని బండి సంజయ్‌ విమర్శించారు. 
 


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని