BS Koshyari: ‘మీ ప్రభుత్వం మైనార్టీలో ఉంది’.. ఠాక్రేకు గవర్నర్ లేఖ

మహారాష్ట్రలో రాజకీయ అనిశ్చితి కీలక దశకు చేరుకున్నట్లు కనిపిస్తోంది. రేపు అధికార సంకీర్ణ కూటమి(MVA) మెజార్టీ నిరూపించుకోవాలని ఈ ఉదయం గవర్నర్ ఆదేశించిన సంగతి తెలిసిందే.

Updated : 29 Jun 2022 18:56 IST

ముంబయి: మహారాష్ట్రలో రాజకీయ అనిశ్చితి కీలక దశకు చేరుకున్నట్లు కనిపిస్తోంది. రేపు అధికార సంకీర్ణ కూటమి(MVA) మెజార్టీ నిరూపించుకోవాలని ఈ ఉదయం గవర్నర్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని తెలియజేస్తూ.. గవర్నర్ బీఎస్‌ కోశ్యారీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు లేఖ రాశారు. ప్రభుత్వం మైనార్టీలో ఉందని భాజపా, ఇతరుల నుంచి అనేక లేఖలు వచ్చాయని, దానికి అనుగుణంగానే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

‘మహా వికాస్ అఘాడీ నుంచి వైదొలగాలని మెజార్టీ శివసేన ఎమ్మెల్యేలు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. మీరు.. మీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలను అప్రజాస్వామికంగా గెలుచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. మీ ప్రభుత్వం విశ్వాసం కోల్పోయిందని, మీరు మైనార్టీలో ఉన్నారని నేను విశ్వసిస్తున్నాను’ అని గవర్నర్ ఆ లేఖలో పేర్కొన్నారు. బల నిరూపణ ప్రక్రియ అంతా ప్రత్యక్ష ప్రసారం అవుతుందని చెప్పారు. అలాగే ఈ తంతు నిష్పాక్షికంగా జరిగిందని నిర్ధారించేందుకు ఓట్ల లెక్కింపు కోసం సభ్యులు తమ సీట్లను నుంచి లేచి నిలబడాలని కోరనున్నట్లు వెల్లడించారు.

ఇదిలా ఉండగా..బలపరీక్ష ప్రకటనను సవాలు చేస్తూ ఠాక్రే వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ బలపరీక్ష చట్ట విరుద్ధమని, దీనిపై తక్షణ విచారణ చేపట్టాలని న్యాయస్థానాన్ని కోరింది. ఈ పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు.. ఈ సాయంత్రం 5 గంటలకు విచారించేందుకు అంగీకరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని