UP Polls 2022: యోగి ఆయోధ్య నుంచే పోటీ చేయబోతున్నారా?

యూపీ ఎన్నికల్లో ప్రతిష్ఠాత్మకంగా భావించే అయోధ్య అసెంబ్లీ స్థానం నుంచి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను బరిలోకి దింపాలని భాజపా అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది......

Published : 12 Jan 2022 23:55 IST

లఖ్‌నవూ: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఉత్తర్‌ప్రదేశ్‌లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. భాజపా ప్రభుత్వానికి షాకిస్తూ వరుసగా రెండు రోజుల్లో ఇద్దరు మంత్రులు సహా.. పలువురు ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే యూపీ ఎన్నికల్లో ప్రతిష్ఠాత్మకంగా భావించే అయోధ్య అసెంబ్లీ స్థానం నుంచి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను బరిలోకి దింపాలని భాజపా అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ సీనియర్‌ నేతలంతా ఈ విషయంపై చర్చించినట్లు సమాచారం. తాను ఏ స్థానం నుంచైనా పోటీ చేస్తానంటూ కొద్దిరోజుల క్రితమే యోగి ప్రకటించడం ఇందుకు బలం చేకూరుస్తోంది. అయితే అయోధ్యలో పోటీపై భాజపా అధిష్ఠానానిదే తుది నిర్ణయం కానుంది.

అయోధ్య సిట్టింగ్‌ ఎమ్మెల్యే వేద్‌ ప్రకాశ్‌ గుప్తా సైతం గతంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయోధ్య నుంచి ముఖ్యమంత్రి పోటీ చేస్తానంటే అందుకు తాను సిద్ధమని పేర్కొన్నారు. ‘రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఇక్కడి నుంచి పోటీ చేస్తే అది అయోధ్య ప్రజలందరికీ గర్వకారణం. ఎవరు ఎక్కడి నుండి పోటీ చేయాలో పార్టీ నిర్ణయిస్తుంది. సీఎం ఆదిత్యనాథ్‌ అయోధ్య నుంచి పోటీ చేస్తానంటే మేమంతా ఆయన కోసం ప్రచారం నిర్వహిస్తాం’ అని వేద్‌ ప్రకాశ్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని