Hyderabad: జాతీయపార్టీ లేకుండా ప్రాంతీయ పార్టీల కూటమి అసాధ్యం: ఈటల

ప్రజల ఆగ్రహం నుంచి తప్పించుకునేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముంబయి పర్యటనకు వెళ్లారని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ విమర్శించారు.

Published : 21 Feb 2022 01:37 IST

హైదరాబాద్‌: ప్రజల ఆగ్రహం నుంచి తప్పించుకునేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముంబయి పర్యటనకు వెళ్లారని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ విమర్శించారు. జాతీయ పార్టీ లేకుండా ప్రాంతీయ పార్టీల కూటమి సాధ్యం కాదని అయన స్పష్టం చేశారు. గవర్నర్‌ తమిళిసైను మేడారంలో అవమాన పరిచారని మండిపడ్డారు. సంస్కార హీనమైన సంప్రదాయానికి సీఎం తెర తీశారని అగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుట్టిన రోజున ప్రధాని మోదీ ఫోన్‌ చేసి శుభాకాంక్షలు చెప్పారని గుర్తు చేస్తూ.. వ్యక్తులు కాదు, వ్యవస్థలు ముఖ్యమని అన్నారు. ప్రజాస్వామ్యంలో దాడులు తాత్కాలిక విజయాన్ని మాత్రమే ఇస్తాయని మంత్రి కేటీఆర్‌ తెలుసుకోవాలన్నారు. భాజపా కార్యకర్తలపై దాడులు కొనసాగుతాయని కేటీఆర్ చిల్లర వ్యాఖ్యలు చేశారన్నారు. వీఆర్వోలను ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు పెడుతోందన్నారు. ఉద్యోగ నియామకాలపై కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదని, ఉద్యోగాల భర్తీ లేక యువకులు వివాహం చేసుకోవడం లేదని ఈటల ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని