BJP: ముక్తో నుంచి బరిలో పెమా ఖండూ.. ‘అరుణాచల్‌’ అసెంబ్లీ ఎన్నికలకు భాజపా అభ్యర్థుల జాబితా విడుదల

అరుణాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు భాజపా అభ్యర్థుల జాబితా విడుదలైంది.

Published : 13 Mar 2024 16:29 IST

దిల్లీ: లోక్‌సభతో పాటు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది రోజుల్లోనే నోటిఫికేషన్‌ వెలువడనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా భాజపా (BJP) పూర్తిస్థాయి సన్నద్ధతతో ముందుకెళ్తోంది. లోక్‌సభ ఎన్నికలకు (Lok Sabha elections) ఇప్పటికే 195 మందితో తొలి జాబితాను విడుదల చేసిన కమలనాథులు.. రెండో జాబితాను సిద్ధం చేశారు.  తాజాగా అరుణాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సైతం అభ్యర్థులను ఖరారు చేసి..  మొత్తం 60 స్థానాలకు ఒకేసారి అభ్యర్థుల జాబితాను బుధవారం మధ్యాహ్నం విడుదల చేశారు. ముఖ్యమంత్రి పెమా ఖండూ ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ముక్తో సీటు నుంచే మళ్లీ పోటీలో దిగనున్నారు. లోక్‌సభ ఎన్నికలతో పాటు ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2019లో జరిగిన అరుణాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా 41 సీట్లు గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని