BY Vijayendra: భాజపా కర్ణాటక అధ్యక్షుడిగా యడియూరప్ప తనయుడు

భాజపా కర్ణాటక అధ్యక్షుడిగా పార్టీ సీనియర్‌ నేత యడియూరప్ప కుమారుడు బీవై విజయేంద్ర నియమితులయ్యారు.

Published : 10 Nov 2023 19:55 IST

బెంగళూరు: కర్ణాటక (Karnataka) అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన భాజపా (BJP).. తాజాగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చింది. భాజపా కర్ణాటక విభాగం అధ్యక్షుడిగా పార్టీ సీనియర్‌ నేత, మాజీ సీఎం యడియూరప్ప తనయుడు బీవై విజయేంద్ర (BY Vijayendra)ను నియమించింది. 2020 నుంచి భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బాధ్యతల్లో ఉన్న విజయేంద్ర.. అధ్యక్షుడి స్థానంలో ఉన్న నళిన్‌కుమార్‌ కటీల్‌ను భర్తీ చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చుతారనే ఊహాగానాలకు దీంతో తెరపడింది.

రాజస్థాన్‌ ఎన్నికల వేళ.. ప్రైవేటు లాకర్లలో బయటపడుతున్న నోట్ల కట్టలు..!

గత అసెంబ్లీ ఎన్నికల్లో బీవై విజయేంద్ర తన తండ్రి స్థానమైన శికారీపుర నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. న్యాయవిద్య పూర్తి చేసిన విజయేంద్ర.. గతంలో భారతీయ జనతా యువ మోర్చా జనరల్‌ సెక్రెటరీగానూ పనిచేశారు. కర్ణాటకలో భాజపాపై లింగాయత్‌ నేత యడియూరప్ప ప్రభావాన్ని అధిష్ఠానం అంగీకరిస్తోందనేదానికి ఈ నిర్ణయమే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా విజయేంద్ర నియామకం.. యడియూరప్పకు రాజకీయ వారసత్వంగా పరిగణిస్తున్నారు. యడియూరప్ప పెద్ద కుమారుడు బీవై రాఘవేంద్ర ప్రస్తుతం శివమొగ్గ నుంచి లోక్‌సభ ఎంపీగా ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని