Chandrababu: హైకోర్టు వ్యాఖ్యలపై జగన్‌ ఏం సమాధానం చెబుతారు?: చంద్రబాబు

రాత్రిపూట కూల్చివేతల అంశంలో హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై సీఎం జగన్‌ ఏం సమాధానం చెబుతారని తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. తప్పుచేసిన అధికారులు మూల్యం

Published : 20 Jun 2022 13:09 IST

అమరావతి: రాత్రిపూట కూల్చివేతల అంశంలో హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై సీఎం జగన్‌ ఏం సమాధానం చెబుతారని తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. తప్పుచేసిన అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి ఇంటిగోడ కూల్చివేతకు నిరసనగా తెదేపా ‘చలో నర్సీపట్నం’ కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. పలువురు తెదేపా నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్‌ చేయడంతో పాటు గృహనిర్బంధాలు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసుల వైఖరిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయ్యన్నది కబ్జా కాదని.. ఇడుపులపాయలో 600 ఎకరాల దళితుల భూములు చెరబట్టడం కబ్జా అని చంద్రబాబు ధ్వజమెత్తారు. నిత్యం తెదేపా నేతల హౌస్‌ అరెస్ట్‌లు జగన్‌ పిరికితనాన్ని చాటుతున్నాయని చంద్రబాబు దుయ్యబట్టారు. ప్రజల తరఫున గట్టిగా గళం వినిపిస్తున్న తెదేపా బీసీ నేతలపై కేసులు, అరెస్ట్‌లు, ఇళ్లపై దాడులతో వారిని జగన్‌ వేధించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ కక్ష సాధింపుకోసం కోర్టు నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రతి అధికారి మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. అయ్యన్న ఇంటిపై దాడి పతనమైన జగన్‌ ప్రభుత్వ ఆలోచనలకు పరాకాష్ఠ అని చంద్రబాబు మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని