Chandrababu: కేసీఆర్‌ జాతీయ పార్టీ.. చంద్రబాబు ఎలా స్పందించారంటే..

రాజధాని అమరావతిపై రోజుకోమాట వైకాపాకు తగదని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. అమరావతి.. రాష్ట్ర ప్రజల సంకల్పం, దేవతల ఆశీర్వాదమని చెప్పారు.

Updated : 05 Oct 2022 12:50 IST

విజయవాడ: రాజధాని అమరావతిపై రోజుకోమాట వైకాపాకు తగదని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. అమరావతి.. రాష్ట్ర ప్రజల సంకల్పం, దేవతల ఆశీర్వాదమని చెప్పారు. దసరా ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని సతీసమేతంగా ఆయన దర్శించుకున్నారు. చంద్రబాబు దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు చంద్రబాబు దంపతులకు వేదాశీర్వచనం పలికారు. తొలుత ఆలయ అధికారులు వారికి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.

అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. అన్ని పార్టీల మద్దతు, దుర్గమ్మ ఆశీస్సులతో ఆ నాడు రాజధాని ప్రకటించామని.. ఆ తర్వాత వైకాపా అధికారంలోకి వచ్చి మాట మార్చిందన్నారు. మాట తప్పేవారిని దుర్గమ్మ కూడా క్షమించదని.. దుష్టశక్తులను తుదముట్టించే శక్తి అమ్మవారికి ఉందన్నారు. ఈ సందర్భంగా తెరాస అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ జాతీయ పార్టీపై ప్రకటనపై మీడియా ప్రతినిధులు చంద్రబాబు స్పందన కోరగా.. ఓ నవ్వు నవ్వి అక్కడ నుంచి ఆయన వెళ్లిపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని