Revanth Reddy: కేంద్ర మంత్రి గడ్కరీతో సీఎం రేవంత్‌ భేటీ.. పలు అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చ

దిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్‌ రెడ్డి.. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో భేటీ అయ్యారు.

Updated : 20 Feb 2024 15:53 IST

హైదరాబాద్‌: దిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్‌ రెడ్డి.. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో జాతీయ రహదారులు, ఫ్లై ఓవర్ల నిర్మాణం, రీజినల్‌ రింగ్‌ రోడ్డు సహా పలు అభివృద్ధి ప్రాజెక్టులపై గడ్కరీతో సీఎం చర్చించనున్నట్లు తెలుస్తోంది. రేవంత్‌ రెడ్డి వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ఉన్నారు. ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రోడ్ల అభివృద్ధితోపాటు, అంతర్జాతీయ సంస్థల నుంచి రావాల్సిన నిధుల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. వీటితోపాటు భువనగిరి రహదారి, సిర్పూర్‌-కాగజ్‌నగర్‌ జాతీయ రహదారి, శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన తీగల వంతెనను మరోచోటికి మార్పు చేయాలని కేంద్ర మంత్రిని సీఎం కోరనున్నట్లు సమాచారం. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని