Rajasingh: ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదుకు ఈసీ ఆదేశం

గోషామహల్‌ భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ఎఫ్ఐఆర్‌ నమోదు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఆదేశించింది. ఈమేరకు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి ఈసీ ఆదేశాలు

Published : 19 Feb 2022 20:29 IST

హైదరాబాద: గోషామహల్‌ భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ఎఫ్ఐఆర్‌ నమోదు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఆదేశించింది. ఈమేరకు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రచారం, మీడియాతో మాట్లాడటాన్ని కూడా ఈసీ నిషేధించింది. నోటీసుకు స్పందన లేకపోవడంతో రాజాసింగ్‌పై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎన్నికల నేపథ్యంలో అక్కడి ఓటర్లను ఉద్దేశించి రాజాసింగ్‌ ఇటీవల వీడియో విడుదల చేశారు. యూపీ ఎన్నికల్లో హిందువులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల తర్వాత యోగికి ఓటు వేయని వారిని గుర్తిస్తామని హెచ్చరించారు. భాజపాకు ఓటువేయని వారి ఇళ్లకు బుల్డోజర్లను పంపిస్తామన్నారు. దీనిపై రాజాసింగ్‌కు నోటీసులు జారీ చేసిన ఈసీ.. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. రాజాసింగ్‌ నుంచి స్పందన లేకపోవడంతో ఈసీ చర్యలు చేపట్టింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని