ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించాలి: యనమల

ఆర్టికల్‌ 360 కింద రాష్ట్రంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించాలని శాసనమండలిలో ప్రతిపక్షనే, తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు డిమాండ్‌ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..

Updated : 05 Jan 2020 14:00 IST

అమరావతి: ఆర్టికల్‌ 360 కింద రాష్ట్రంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించాలని శాసనమండలిలో ప్రతిపక్షనేత, తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు డిమాండ్‌ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత 8 నెలల వైకాపా పాలనలో రాష్ట్రంలో ప్రగతి లేదని, ఆదాయం పడిపోవడమే కాకుండా రెవెన్యూ వ్యయం పెరిగిందని ధ్వజమెత్తారు. మూలధన వ్యయం రూ.10,486 కోట్లు తగ్గిందని మండిపడ్డారు. ఉద్యోగుల జీతాలు, పింఛన్లు ఇవ్వడమే కష్టంగా మారిందన్నారు. సంక్షేమంపై వ్యయం రూ.2వేల కోట్లు తగ్గించేశారని, పేదల సంక్షేమ పథకాలకు తూట్లు  పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా ప్రభుత్వ పథకాలను రద్దు చేసి, కోతలు విధించారన్నారు, చేతగాని తనంతో రాష్ట్రాన్ని అర్థిక సంక్షోభంలోకి నెట్టారని విమర్శించారు.

ఆహార ద్రవ్యోల్బణం 5శాతానికి పైగా పెరిగిందని, తలసరి ఆదాయం రెండేళ్ల దిగువకు పడిపోయిందన్నారు. ధరలు పెరిగి, కొనుగోలు శక్తి తగ్గిందని, పొదుపుశక్తి పడిపోయిందన్నారు. రివర్స్‌ టెండర్ల పేరుతో అభివృద్ధిని రివర్స్‌ చేశారని మండిపడ్డారు. పేదల సంక్షేమం కూడా రివర్స్‌ అయిందని దుయ్యబట్టారు. ఈఏడాది బడ్జెట్‌ అంచనాల్లో ద్రవ్యలోటు రూ.35,260 కోట్లు ఉంటే, 8 నెలల్లోనే రూ.35వేల కోట్లు అప్పులు చేశారని తెలిపారు. రాబోయే నాలుగు నెలల్లో ఇంకెంత అప్పు చేస్తారో తెలియని దుస్థితి నెలకొందని ఆక్షేపించారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి చక్కదిద్దే సామర్థ్యం వీళ్లకు లేదని, అందుకే రాష్ట్రాన్ని ఆందోళనల్లో ముంచారని యనమల మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని