తూటాలతో ప్రజా గళాన్ని అడ్డుకోలేరు: అధిర్‌

తూటాలు ప్రయోగించడం ద్వారా ప్రజల గొంతుకను నొక్కేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్‌ లోక్‌సభాపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరి ఆరోపించారు. అధికార భాజపాకు చెందిన నాయకులు నకిలీ హిందువులంటూ.......

Published : 04 Feb 2020 00:49 IST

దిల్లీ: తూటాలు ప్రయోగించడం ద్వారా ప్రజల గొంతుకను నొక్కేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్‌ లోక్‌సభాపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరి ఆరోపించారు. అధికార భాజపాకు చెందిన నాయకులు నకిలీ హిందువులంటూ సోమవారం ఆయన లోక్‌సభలో వ్యాఖ్యానించారు. దిల్లీలోని షాహీన్‌బాగ్‌లో పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన నిరసన శిబిరం వద్ద జరిగిన మూడు కాల్పుల ఘటనల్ని ఉద్దేశించి ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ బహిరంగ సభలో కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ దేశద్రోహుల్ని కాల్చండి అంటూ చేసిన వ్యాఖ్యల్ని ఈ సందర్భంగా అధిర్‌ లోక్‌సభలో ప్రస్తావించారు. ప్రజా గొంతుకను తూటాలతో అణచలేరన్నారు. లోక్‌సభలో జీరో అవర్‌లో మాట్లాడిన అధిర్‌.. సీఏఏపై కేంద్ర ప్రభుత్వం పునఃసమీక్షించాలని డిమాండ్‌ చేశారు. 

సీఏఏ అంశంపై మాట్లాడేందుకు తొలుత కాంగ్రెస్‌ సభాపక్ష నేతకు స్పీకర్‌ ఓంబిర్లా అనమతించకపోవడంతో కాంగ్రెస్‌, డీఎంకే, ఐయూఎంఎల్‌ పార్టీలకు చెందిన ఎంపీలు సభాపతి పొడియం వద్దకు దూసుకెళ్లి ఆందోళనకు దిగారు. ‘ప్రజాస్వామ్యాన్ని రక్షించండి . రాజ్యాంగాన్ని పరిరక్షంచండి.. దేశాన్ని కాపాడండి’ అంటూ నినాదాలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని