సీఎంగా శివరాజ్‌సింగ్ చౌహాన్‌ ప్రమాణం

మధ్యప్రదేశ్‌లో భాజపా ప్రభుత్వం కొలువుదీరింది. భాజపా సీనియర్‌ నేత శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ నాలుగోసారి మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా.....

Updated : 24 Mar 2020 17:03 IST

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో భాజపా ప్రభుత్వం కొలువుదీరింది. భాజపా సీనియర్‌ నేత శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ నాలుగోసారి మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో ఆయన చేత గవర్నర్‌ లాల్జీ ఠాండన్‌ ప్రమాణస్వీకారం చేయించారు. 2005, 2008, 2013లో ఆయన సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. కరోనా దృష్ట్యా ప్రమాణస్వీకార కార్యక్రమం నిరాడంబరంగా జరిగింది. ఆ పార్టీ సీనియర్‌ నేతలు అరుణ్‌ సింగ్, వినయ్‌ సహస్రబుద్దే వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రమాణస్వీకారాన్ని తిలకించారు.

అంతకుముందు మధ్యప్రదేశ్‌ రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. భాజపా నేత జ్యోతిరాదిత్య సింధియాతో పాటు 22 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీని వీడటంతో.. కమల్‌నాథ్‌ సారథ్యంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం పడిపోయింది. కమల్‌నాథ్‌ను బలపరీక్షలో నెగ్గాలని సుప్రీంకోర్టు ఆదేశించగా గడువులోగా నిరూపించుకోలేని పరిస్థితిల్లో ఆయన రాజీనామా చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు