తితిదే ఆస్తులు అమ్ముతారా? పునరాలోచించండి!

తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల అమ్మకం నిలిపివేయాలని తితిదే బోర్డు ప్రత్యేక ఆహ్వానితుడు, రాజ్యసభ సభ్యుడు రాకేశ్‌ సిన్హా కోరారు. ఈ మేరకు ఆయన ...

Updated : 25 May 2020 13:37 IST

సుబ్బారెడ్డికి బోర్డు ప్రత్యేక ఆహ్వానితుడు రాకేశ్‌ సిన్హా లేఖ

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల అమ్మకం నిలిపివేయాలని తితిదే బోర్డు ప్రత్యేక ఆహ్వానితుడు, రాజ్యసభ సభ్యుడు రాకేశ్‌ సిన్హా కోరారు. ఈ మేరకు ఆయన తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డికి లేఖ రాశారు. బోర్డు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరారు. శ్రీవారికి భక్తులు విరాళంగా ఆస్తులు ఇచ్చారనీ.. భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశమైనందున ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని ఆయన సుబ్బారెడ్డిని కోరారు. 

శ్రీవారి స్థిరాస్తులను అమ్మాలని తితిదే ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తమిళనాడులో ఉన్న 23 ఆస్తులు విక్రయించాలని ఎనిమిది మంది అధికారులతో రెండు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసింది. ఈ ఆస్తుల బహిరంగ వేలానికి సంబంధించి విధివిధానాలు ఖరారు చేయాలని ఆదేశించింది. తితిదే తీసుకున్న ఈ నిర్ణయంపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బోర్డు సభ్యుడే లేఖ రాయడం మరింత  తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ నెల 28న జరిగే ధర్మకర్తల మండలి సమావేశంలో దీనిపై పూర్తిస్థాయిలో చర్చ జరిగే అవకాశం ఉంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని