భారాసలోకి మహారాష్ట్ర నేతలు

మహారాష్ట్రకు చెందిన మాజీ ఎంపీ, ఆమ్‌ ఆద్మీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు హరిసింగ్‌ రాథోడ్‌ సహా పలువురు నేతలు శనివారం హైదరాబాద్‌లో భారత్‌ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్‌ సమక్షంలో భారాసలో చేరారు.

Published : 05 Mar 2023 04:07 IST

కేసీఆర్‌ సమక్షంలో మాజీ ఎంపీ సహా పలువురి చేరిక

ఈనాడు, హైదరాబాద్‌: మహారాష్ట్రకు చెందిన మాజీ ఎంపీ, ఆమ్‌ ఆద్మీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు హరిసింగ్‌ రాథోడ్‌ సహా పలువురు నేతలు శనివారం హైదరాబాద్‌లో భారత్‌ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్‌ సమక్షంలో భారాసలో చేరారు. చంద్రాపూర్‌ జడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు సందీప్‌ కరపే, గోండ్‌ పిప్రినగర్‌ సేవక్‌, భాజపా తాలూకా అధ్యక్షుడు బాబన్‌ నికోడె, సమన్వయకర్త ఫిరోజ్‌ఖాన్‌, భాజపా నాయకుడు శైలేష్‌ సింగ్‌ బైసెలు భారాసలోకి వచ్చారు. వారందరికీ కేసీఆర్‌ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. హరిసింగ్‌ మాట్లాడుతూ.. కేసీఆర్‌ జాతీయ దార్శనికత, విధానాలు నచ్చి పార్టీలో చేరుతున్నామన్నారు. మహారాష్ట్రలో పార్టీని బలోపేతం చేస్తామన్నారు.

ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ గడువు పెంచాలి

ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు ఉద్దేశించిన జీవో నెం.58 దరఖాస్తు గడువు పెంచాలని ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ సీఎం కేసీఆర్‌ను కోరారు. శనివారం ఆయన ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రిని కలిశారు. తన నియోజకవర్గ పరిధిలోని పేదలు చాలామంది ఇళ్ల క్రమబద్ధీకరణ కోరుతున్నారని, ప్రభుత్వం నిర్దేశించిన గడువులో వారు దరఖాస్తు చేసుకోనందున గడువు పెంచాలన్నారు. జీవో నం.58 దరఖాస్తు గడువు పెంపుపై సీఎం సానుకూలంగా స్పందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని