తెలుగు ప్రజలకు సర్వశుభాలూ కలగాలి

ఉగాది సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారితో పాటు రాష్ట్ర ప్రజలకు సర్వశుభాలూ కలగాలని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఆకాంక్షించారు.

Published : 23 Mar 2023 05:36 IST

ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు

గవర్నర్‌పేట, న్యూస్‌టుడే: ఉగాది సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారితో పాటు రాష్ట్ర ప్రజలకు సర్వశుభాలూ కలగాలని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఆకాంక్షించారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో బుధవారం కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు నిర్వహించారు. వేద పండితుడు బొర్రా పాండురంగ నవీన్‌శర్మ అవధాని పంచాంగాన్ని పఠించారు. శోభకృత్‌ నామ సంవత్సరంలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, రాజధాని అమరావతిలోనే ఉంటుందని అన్నారు. కాంగ్రెస్‌కు మంచి భవిష్యత్తు ఉంటుందని, కేంద్రంలో అధికారంలోకి వస్తుందని, ఆరోజు ఎంతోదూరం లేదని వివరించారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు ఈ సందర్భంగా ఉగాది పురస్కారాలు అందించారు. వేద సభ, కవి సమ్మేళనం అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. పార్టీ నాయకులు సిరివెళ్ల ప్రసాద్‌, నరహరశెట్టి నరసింహారావు, వి.గురునాథం, కొలనుకొండ శివాజీ, ఖాజా మొహిద్దీన్‌, సుంకర పద్మశ్రీ, ధనేకుల మురళి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని