రాముడిని ఆరాధించానని దాడి చేశారు

కాంగ్రెస్‌ను వీడిన రాధికా ఖేడా ఆ పార్టీ ఛత్తీస్‌గఢ్‌ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాముడి భక్తురాలిని అయినందుకే తనపై దాడి చేశారని సోమవారం ఆమె మీడియాకు తెలిపారు.

Published : 07 May 2024 04:38 IST

గదిలో బంధించి దుర్భాషలాడారు
ఛత్తీస్‌గఢ్‌ కాంగ్రెస్‌ నేతలపై రాధికా ఖేడా తీవ్ర ఆరోపణలు

దిల్లీ: కాంగ్రెస్‌ను వీడిన రాధికా ఖేడా ఆ పార్టీ ఛత్తీస్‌గఢ్‌ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాముడి భక్తురాలిని అయినందుకే తనపై దాడి చేశారని సోమవారం ఆమె మీడియాకు తెలిపారు. ఏఐసీసీ అధికార ప్రతినిధిగా పనిచేసిన రాధిక ఆదివారం కాంగ్రెస్‌ పార్టీని వీడారు. అయోధ్య రామాలయాన్ని సందర్శించినప్పటి నుంచి తనపై పార్టీలో కుట్ర జరిగిందని పేర్కొన్నారు. ‘‘ఛత్తీస్‌గఢ్‌లో రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో న్యాయ యాత్ర కొనసాగుతున్న సమయంలో రాష్ట్ర పార్టీ మీడియా ఛైర్మన్‌ సుశీల్‌ ఆనంద్‌ శుక్లా మద్యం తాగడంతో పాటు నాకూ ఇవ్వాలని చూశారు. ఏప్రిల్‌ 30న రాష్ట్ర కాంగ్రెస్‌ కార్యాలయంలో సుశీల్‌ ఆనంద్‌తో మాట్లాడటానికి వెళ్లగా దుర్భాషలాడారు. మరో ఇద్దరు నాయకులతో కలిసి నన్ను గదిలో బంధించి దాడి చేశారు. పార్టీ అగ్ర నాయకులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు’’ అని రాధిక తెలిపారు. రాధికా ఖేడా భాజపా భాషలో మాట్లాడుతున్నారని ఛత్తీస్‌గఢ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు దీపక్‌ బైజ్‌ ఆక్షేపించారు. అసలు విషయాన్ని పక్కదారి పట్టించేలా ముందస్తు ప్రథకం ప్రకారమే హిందూ మతం అంశాన్ని ఆమె ప్రస్తావిస్తోందని ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని