ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని తొలుత రూపొందించింది జగన్‌ ప్రభుత్వమే

దేశంలో తొలిసారిగా ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని రూపొందించిందే జగన్‌ ప్రభుత్వం అని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన బిల్లును కేంద్రం తిప్పి పంపినా మూడు సార్లు ఆమోదం కోసం పంపారని గుర్తుచేశారు.

Published : 07 May 2024 04:48 IST

ఈ చట్టంపై ‘ఈటీవీ’లో సునీల్‌కుమార్‌ ఇచ్చిన ఇంటర్వ్యూను వక్రీకరిస్తూ ‘సాక్షి’లో కథనం
తెదేపా నేత ఆనం వెంకటరమణారెడ్డి

ఈనాడు డిజిటల్‌, అమరావతి: దేశంలో తొలిసారిగా ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని రూపొందించిందే జగన్‌ ప్రభుత్వం అని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన బిల్లును కేంద్రం తిప్పి పంపినా మూడు సార్లు ఆమోదం కోసం పంపారని గుర్తుచేశారు. ఈ యాక్ట్‌పై ప్రముఖ భూ చట్టాల నిపుణుడు సునీల్‌కుమార్‌ ‘ఈటీవీ’లో ఇచ్చిన ఇంటర్వ్యూను ‘సాక్షి’ పత్రిక వక్రీకరించిందన్నారు. అందుకు సాక్షి తరఫున వైఎస్‌ భారతి రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండు చేశారు. మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో సోమవారం వెంకటరమణారెడ్డి విలేకర్లతో మాట్లాడారు. ‘‘ఈటీవీ ‘అన్నదాత’ కార్యక్రమంలో ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై సునీల్‌కుమార్‌ తన వ్యక్తిగత అభిప్రాయాల్ని వివరించారు. దాన్ని ఈటీవీకి, సంస్థ యాజమాన్యానికి ఆపాదిస్తూ ‘సాక్షి’లో కథనాలెలా ప్రచురిస్తారు? ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై ఏపీ ప్రభుత్వం వేసిన సలహా సంఘంలో ఆయనా ఒకరు. ఈ విషయాల్ని సాక్షిలో ఎందుకు ప్రచురించలేదు? ఇదేనా మీ నిబద్ధత?’’ అని భారతిరెడ్డిని ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని