కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్లు

వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది.

Updated : 07 May 2024 06:21 IST

ఈనాడు, నల్గొండ: వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే 11 మంది అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేయగా...సోమవారం ఒక్కరోజే వివిధ పార్టీలు, స్వతంత్రులు కలిపి మరో 11 మంది అభ్యర్థులు నామినేషన్‌ వేశారు. దీంతో నామినేషన్‌ వేసిన అభ్యర్థుల సంఖ్య 22కు చేరింది. భారాస అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డి తరఫున ప్రతిపాదకులు నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. తెదేపా నుంచి ముండ్ర మల్లికార్జున్‌రావు, ధర్మసమాజ్‌ పార్టీ (డీఎస్‌పీ) నుంచి బరిగెల దుర్గాప్రసాద్‌, స్వతంత్ర అభ్యర్థులుగా పులిపాక సుజాత, చీదళ్ల ఉమామహేశ్వరి, చీదళ్ల వెంకట సాంబశివరావు, తాడిశెట్టి క్రాంతికుమార్‌, అయితగోని రాఘవేంద్ర, బుగ్గ శ్రీకాంత్‌, పాలకూరి అశోక్‌గౌడ్‌, దేశగాని సాంబశివరావు అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి మహేందర్‌కు నామినేషన్‌ పత్రాలను అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు