సీఎస్‌ను వెంటనే బదిలీ చేయాలి: రఘురామ

రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరగాలంటే సీఎస్‌నూ వెంటనే బదిలీ చేయాలని నరసాపురం ఎంపీ, తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి రఘురామకృష్ణరాజు డిమాండు చేశారు.

Published : 07 May 2024 04:47 IST

ఈనాడు డిజిటల్‌, భీమవరం: రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరగాలంటే సీఎస్‌నూ వెంటనే బదిలీ చేయాలని నరసాపురం ఎంపీ, తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి రఘురామకృష్ణరాజు డిమాండు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పెదఅమిరంలోని తన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘రచ్చబండ’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెదేపా, జనసేన, భాజపా కూటమి దెబ్బకు వైకాపా గల్లంతు కానుందని.. అన్ని సర్వేల్లోనూ ఇదే స్పష్టమవుతోందని ఆయన చెప్పారు. ‘ఉభయగోదావరి జిల్లాల్లో కూటమి క్లీన్‌స్వీప్‌ చేయడం ఖాయం. భూ హక్కు చట్టం గురించి ప్రజలకు వివరించినందుకు చంద్రబాబు, లోకేశ్‌పై కేసులు నమోదు చేయడం వైకాపా దమనకాండకు నిదర్శనం. మాతృభాషను అవమానించేందుకు జగన్‌ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటామని అమిత్‌షా అంటే.. ఈ అంశాన్ని సాక్షి పత్రిక వక్రీకరించి రాయడం సిగ్గుచేటు’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని