Vangalapudi Anitha: 40 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు: అనిత

‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేస్తే ఆగమేఘాలపై వారిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు.

Updated : 28 Mar 2023 17:23 IST

విశాఖపట్నం(వన్‌టౌన్‌), న్యూస్‌టుడే: ‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేస్తే ఆగమేఘాలపై వారిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. ఏకంగా 40 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు. వారి గురించి తెలిస్తే సీఎం జగన్‌కు పక్షవాతం వస్తుంది...’ అని తెదేపా మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత పేర్కొన్నారు. సోమవారం విశాఖ తెదేపా కార్యాలయంలో విలేకర్లతో ఆమె మాట్లాడుతూ... ‘తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి ఆవేదనతో మాట్లాడితే... ఊసరవెల్లి శ్రీదేవి అంటూ మంత్రి అమర్‌నాథ్‌ మాట్లాడడం దారుణం. ఎంత డబ్బు ఇచ్చి జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావును వైకాపాలోకి తెచ్చుకున్నారో చెప్పాలి. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గంలో తెదేపాకు ఎన్ని ఓట్లు వచ్చాయి, వైకాపాకు ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసుకొని మంత్రి రోజా మాట్లాడాలి...’ అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ గంజాయిను రాష్ట్ర పంటగా మార్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. తిరుమల కొండపై గంజాయి దొరకడం వైకాపా ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని