షర్మిల ఇంటి వద్ద ఉద్రిక్తత

ఉస్మానియా ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు లేవంటూ దాన్ని సందర్శించేందుకు బయలుదేరిన వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలను మంగళవారం ఆమె ఇంటి వద్ద పోలీసులు అడ్డుకున్నారు.

Published : 29 Mar 2023 05:09 IST

ఉస్మానియా ఆసుపత్రి పరిశీలనకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు

ఫిలింనగర్‌, న్యూస్‌టుడే: ఉస్మానియా ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు లేవంటూ దాన్ని సందర్శించేందుకు బయలుదేరిన వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలను మంగళవారం ఆమె ఇంటి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు, షర్మిలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో పాటు ఉద్రిక్తత ఏర్పడింది. పార్టీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాటలో ఆమె ఒక్కసారిగా కిందపడ్డారు. అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని, ఎక్కడికీ వెళ్లకుండా గృహ నిర్బంధం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉస్మానియా ఆసుపత్రిలో కనీసం సౌకర్యాలు లేవని, రూ.200 కోట్లతో టవర్స్‌ కడతామని ముఖ్యమంత్రి తొమ్మిదేళ్ల క్రితం చెప్పారని గుర్తు చేశారు. ఆసుపత్రిలో ప్రజలకు సరైన వైద్యం అందడం లేదని తనకు ఫిర్యాదులు వచ్చాయన్నారు. ప్రశ్నిస్తే గృహ నిర్బంధాలా? అని నిలదీశారు. ప్రజాసమస్యలపై పోరాడితే రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌లనూ అరెస్ట్‌ చేశారని, ప్రతిపక్షాల మీద ఎందుకీ కుట్ర అంటూ షర్మిల ప్రశ్నించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని