కేంద్రానిది ‘సమాఖ్య’పై దాడే
దిల్లీలో పరిపాలన సేవల నియంత్రణపై కేంద్రం ఆర్డినెన్స్ తీసుకురావడం సమాఖ్య వ్యవస్థపై దాడి చేయడమేనని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు.
ఆప్ ఆందోళనకు మద్దతు - సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
దిల్లీ: దిల్లీలో పరిపాలన సేవల నియంత్రణపై కేంద్రం ఆర్డినెన్స్ తీసుకురావడం సమాఖ్య వ్యవస్థపై దాడి చేయడమేనని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. కేంద్రం చర్యను ఖండిస్తున్నట్లు తెలిపారు. పార్లమెంటు ముందుకు ఆర్డినెన్స్ స్థానంలో బిల్లును తీసుకొచ్చినప్పుడు ఆప్‌నకు మద్దతుగా దానిని వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. దిల్లీలోని సీపీఎం కార్యాలయంలో ఏచూరితో దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆర్డినెన్స్ అంశంలో వామపక్ష పార్టీల మద్దతు కోరారు. ఈ క్రమంలో ఆర్డినెన్స్ విషయంలో కాంగ్రెస్ సహా అన్ని ప్రతిపక్ష పార్టీలు ఆమ్ ఆద్మీ పార్టీకి అండగా నిలవాలని ఏచూరి పిలుపునిచ్చారు. కేంద్రం చర్య నిస్సిగ్గు ఉల్లంఘన అని అభివర్ణించారు. రాజ్యాంగం, సమాఖ్య వ్యవస్థకు ఆధారాలైన స్తంభాలపై భాజపా ప్రభుత్వం దాడికి దిగి నాశనం చేస్తోందని ఆరోపించారు. కేజ్రీవాల్ మాట్లాడుతూ..ఆర్డినెన్స్‌పై బిల్లు రాజ్యసభ ముందుకు వచ్చినప్పుడు ప్రతిపక్షాల ఐక్యత దాన్ని అడ్డుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
కులాంతర వివాహం చేసుకున్నారని మూగ దంపతుల గ్రామ బహిష్కరణ
-
విశాఖ స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణ నిలిచిపోయింది: భాజపా ఎంపీ జీవీఎల్
-
గృహరుణం... తొందరగా తీర్చేద్దాం
-
నేపాలీ షెర్పా ప్రపంచ రికార్డు
-
సుప్రీం కోర్టు ఆదేశాలనే మార్చేశారు.. పోలీసు కేసు పెట్టాలని ధర్మాసనం ఆదేశం
-
సిబ్బందిని మందలించిందని.. వ్యాపార భాగస్వామిని చితకబాదాడు..