Rahul Gandhi: రాహుల్‌.. పెళ్లి చేసుకోవయ్యా!

పట్నాలో విపక్షాల భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆర్‌జేడీ అధ్యక్షుడు లాలూప్రసాద్‌ తనదైన శైలిలో నవ్వులు పూయించారు.

Updated : 24 Jun 2023 07:54 IST

కాంగ్రెస్‌ అగ్రనేతకు లాలూ సూచన

పట్నాలో విపక్షాల భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆర్‌జేడీ అధ్యక్షుడు లాలూప్రసాద్‌ తనదైన శైలిలో నవ్వులు పూయించారు. పెళ్లి చేసుకోవాలంటూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీకి ఆయన సూచించారు. ‘‘మా మాట విను.. పెళ్లి చేసుకోవయ్యా. మేమంతా నీ బరాత్‌కు రావాలనుకుంటున్నాం. వివాహానికి నీవింకా విముఖత చూపుతుండటంతో మీ అమ్మ (సోనియాగాంధీ) ఆందోళన చెందుతోంది’’ అని రాహుల్‌ను ఉద్దేశించి లాలూ వ్యాఖ్యానించారు. దాంతో రాహుల్‌ కాస్త సిగ్గుతో ముసిముసి నవ్వులు చిందించారు. ‘మీరు చెప్పారు కాబట్టి.. అది జరుగుతుంది’ అని కూడా ఆయన బదులివ్వడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని