Raghunandan: కాళేశ్వరంపై సమీక్ష నిర్వహిస్తే అసలు దోషి బయటపడతాడు: రఘునందన్‌

కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని భాజపా మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆరోపించారు.

Updated : 19 Dec 2023 13:45 IST

హైదరాబాద్‌ : కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని భాజపా మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆరోపించారు. ఈ ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహిస్తే అసలు దోషి బయటపడతాడని పేర్కొన్నారు. రాష్ట్ర భాజపా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘2008లోనే వైఎస్‌ హయాంలో కాళేశ్వరంపై సమీక్ష జరిగింది. నాడు 160 టీఎంసీలతో 12 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా ప్రతిపాదన చేశారు. వైఎస్‌ హయాంలోనే మరో 2 లక్షల ఎకరాల ఆయకట్టు పెంచేలా మరోసారి ప్రతిపాదన చేశారు’’ అని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐతో విచారణ చేయించాలని రఘునందన్‌రావు డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని