BRS-BSP: పొత్తుపై భారాస, బీఎస్పీ చర్చలు

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో కలిసి పోటీ చేసే విషయంపై భారాస, బీఎస్పీ నేతలు చర్చించారు.

Updated : 14 Mar 2024 08:24 IST

ఈనాడు, హైదరాబాద్‌: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో కలిసి పోటీ చేసే విషయంపై భారాస, బీఎస్పీ నేతలు చర్చించారు. భారాస అధినేత కేసీఆర్‌తో హైదరాబాద్‌ నందినగర్‌లోని తన నివాసంలో బుధవారం బీఎస్పీ ఎంపీ రాంజీ గౌతమ్‌, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ భేటీ అయ్యారు. ఇప్పటికే తెలంగాణలో భారాసతో పొత్తుపై బీఎస్పీ అధినేత్రి మాయావతి పచ్చజెండా ఊపిన నేపథ్యంలో తాజా సమావేశంలో సీట్ల పంపకాలు, పోటీ చేసే స్థానాలపై చర్చలు జరిపారు.

భారాసతో చర్చలు సఫలీకృతమైనట్లు బీఎస్పీ ఎంపీ రాంజీ గౌతమ్‌ తెలిపారు. బీఎస్పీ పోటీ చేసే స్థానాలను త్వరలో వెల్లడిస్తామని ప్రకటించారు. నాగర్‌కర్నూల్‌, ఆదిలాబాద్‌ స్థానాల్లో పోటీకి బీఎస్పీ ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. అయితే ఒక ఎంపీ సీటును బీఎస్పీకి కేటాయిస్తామని భారాస చెప్పినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు