ప్రజాగళం విజయవంతంతోసర్దుకుంటున్న జగన్‌ సర్కారు

చిలకలూరిపేటలో ఎన్డీఏ సభ (ప్రజాగళం) విజయవంతం కావడంతో జగన్‌ ప్రభుత్వం తట్టాబుట్టా సర్దుకునే పనిలో నిమగ్నమైందని భాజపా అధికార ముఖ్య ప్రతినిధి లంకా దినకర్‌ విమర్శించారు.

Published : 19 Mar 2024 04:52 IST

భాజపా నేత లంకా దినకర్‌ విమర్శ

ఈనాడు, అమరావతి: చిలకలూరిపేటలో ఎన్డీఏ సభ (ప్రజాగళం) విజయవంతం కావడంతో జగన్‌ ప్రభుత్వం తట్టాబుట్టా సర్దుకునే పనిలో నిమగ్నమైందని భాజపా అధికార ముఖ్య ప్రతినిధి లంకా దినకర్‌ విమర్శించారు. జగన్‌ నేతృత్వంలో నాలుగు సిద్ధం సభలు ప్రజాధనం దుర్వినియోగంతో జరిగితే, ఆదివారం నాటి ఎన్డీఏ సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారని పేర్కొన్నారు. విజయవాడలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘‘అవినీతి, అరాచక, విధ్వంస పాలన నుంచి ప్రజలను కాపాడటమే తెదేపా, జనసేన, భాజపాల కింకర్తవ్యం. అమరావతిలో జగన్‌ నిర్వీర్యం చేసిన అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వ సంస్థలు అధికారంలోకి రాబోయే ఎన్డీఏ ద్వారా తప్పకుండా సాకారమవుతాయి. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ భూములను మోదీ ప్రభుత్వం లేకుంటే తల్లీ పిల్లా కాంగ్రెస్‌ నేతలు పంచుకునే వారు. కడప స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు అవసరమైన సమాచారం ఇవ్వకుండా జగన్‌ తన మిత్రులకు కట్టబెట్టేందుకు మళ్లీ మళ్లీ శంకుస్థాపనలు చేశారు. ఇది నిజమా.. కాదా..’’ అని ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని