5 భాషల్లో టీఎంసీ మ్యానిఫెస్టో!

తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) పార్టీ ఒకటిరెండు రోజుల్లో నేపాలీస్‌ సహా ఐదు భాషల్లో మ్యానిఫెస్టోను విడుదల చేయబోతోంది.

Published : 16 Apr 2024 05:19 IST

దిల్లీ: తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) పార్టీ ఒకటిరెండు రోజుల్లో నేపాలీస్‌ సహా ఐదు భాషల్లో మ్యానిఫెస్టోను విడుదల చేయబోతోంది. పశ్చిమబెంగాల్‌లో అధికారంలో ఉన్న తృణమూల్‌.. బెంగాలీ, హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్‌తో పాటు సంతాలీ భాష ఓల్‌చికిలో తమ ఎన్నికల ప్రణాళికను వెలువరించనుంది. మరోపక్క పశ్చిమబెంగాల్‌లోని ముర్షిదాబాద్‌ డీఐజీని తొలగించాలని ఈసీ ఆదేశించింది. హింసాత్మక ఘటనల నిరోధానికి ఆయన తక్షణ చర్యలు తీసుకోలేదని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని