తెరాస కండువా కప్పుకోవాలి: ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

తెరాస పార్టీ కండువా కప్పుకోవాలని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌(తెరాస కార్మిక విభాగం అనుబంధం) రాష్ట్ర అధ్యక్షురాలు నల్ల భారతితో వ్యాఖ్యానించగా..

Published : 27 Jun 2022 05:24 IST

తిరస్కరించిన అంగన్‌వాడీ యూనియన్‌ నేత

జనగామ టౌన్‌, న్యూస్‌టుడే: తెరాస పార్టీ కండువా కప్పుకోవాలని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌(తెరాస కార్మిక విభాగం అనుబంధం) రాష్ట్ర అధ్యక్షురాలు నల్ల భారతితో వ్యాఖ్యానించగా.. ఆమె తిరస్కరించిన ఘటన ఆదివారం జనగామలో జరిగింది. యూనియన్‌ జిల్లా మహాసభను జనగామలో నిర్వహించారు. వేదికపై ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి పక్కనే నల్లభారతి కూర్చొన్నారు. కార్యకర్తలు తెరాస పార్టీ కండువాలు కప్పారు. ఈ క్రమంలో ఆమె వద్దని చేతులతో చూపించారు. ఈ సమయంలో ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి జోక్యం చేసుకొని పార్టీ కండువా కప్పుకోవాలని నల్ల భారతిని కోరారు. తాను ఉద్యోగ సంఘ నేతనని, పార్టీ కార్మిక విభాగం అనుబంధంగా ఉన్నా ఉద్యోగ సంఘాల నేతలు తెరాస కండువా కప్పుకోవడం సంప్రదాయం కాదని ఆమె తిరస్కరించారు. పార్టీ కండువా కప్పుకొంటేనే ఈ సభలో ఉంటానని ఎమ్మెల్యే లేచారు. ఆమె యూనియన్‌ కండువాను అడిగి మెడలో వేసుకున్నారు. పార్టీది మాత్రం వేసుకోలేదు. ఎమ్మెల్యేకు యూనియన్‌ నేతలు సర్దిచెప్పారు. తర్వాత ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి ప్రసంగించి వెళ్లిపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని