జాతీయ పార్టీ హోదా దిశగా ఆమ్‌ ఆద్మీ పార్టీ: కేజ్రీవాల్‌

ఈ ఏడాది ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఓట్లు, సీట్ల ఆధారంగా ఆమ్‌ ఆద్మీ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గోవాలో రాష్ట్ర పార్టీ హోదా ఇచ్చిందని ఆ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌

Published : 10 Aug 2022 05:47 IST

దిల్లీ: ఈ ఏడాది ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఓట్లు, సీట్ల ఆధారంగా ఆమ్‌ ఆద్మీ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గోవాలో రాష్ట్ర పార్టీ హోదా ఇచ్చిందని ఆ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ మంగళవారం ట్విటర్‌లో తెలిపారు. దిల్లీ, పంజాబ్‌లలో అధికారంలో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీకి ఇప్పటికే అక్కడ రాష్ట్ర పార్టీ హోదా ఉంది. తాము మరొక్క రాష్ట్రంలో రాష్ట్ర పార్టీ హోదా పొందితే జాతీయ పార్టీగా గుర్తింపు లభిస్తుందని కేజ్రీవాల్‌ చెప్పారు. ఈ ఏడాది గోవా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీకి రెండు సీట్లు, 6.77 శాతం ఓట్లు లభించాయి. పంజాబ్‌లోని 117 అసెంబ్లీ సీట్లకు 92 గెలుచుకుని 42.01 శాతం ఓట్లు సాధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని