పోలవరం అథారిటీ లేఖపై వివరణ ఇవ్వాలి: సీపీఎం

వరదలకు ముందే జులై 31నాటికి పోలవరం దిగువ కాఫర్‌ డ్యాం పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని చేరుకోలేకపోవడంపై పోలవరం అథారిటీ ప్రభుత్వానికి రాసిన లేఖపై వివరణ ఇవ్వాలని సీపీఎం

Published : 11 Aug 2022 04:48 IST

ఈనాడు, అమరావతి: వరదలకు ముందే జులై 31నాటికి పోలవరం దిగువ కాఫర్‌ డ్యాం పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని చేరుకోలేకపోవడంపై పోలవరం అథారిటీ ప్రభుత్వానికి రాసిన లేఖపై వివరణ ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. పోలవరం ముంపుపై ఇప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టత లేదని విమర్శించారు. కాంటూరు లెక్కలన్నీ తప్పులతడకగా ఉన్నాయని, ఇంజినీరింగ్‌తో పాటు ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా వెల్లడైందని పేర్కొన్నారు. 2013 చట్టం ప్రకారం పూర్తిస్థాయి పునరావాసం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని