ప్రాథమిక బడులను చీల్చడం ఎక్కడా జరగని వింత

ప్రాథమిక పాఠశాలల్ని నిట్టనిలువునా చీల్చడం దేశంలోనే కాదు.. ప్రపంచంలోనూ ఎక్కడ జరగని వింత అని ‘ఆరు రకాల స్కూళ్లు ఎవరి కోసం- ఎందుకోసం’ అనే పుస్తకంలో ఎమ్మెల్సీ

Published : 12 Aug 2022 05:08 IST

‘ఆరు రకాల స్కూళ్లు ఎవరి కోసం- ఎందుకోసం’ అనే పుస్తకంలో ఎమ్మెల్సీ విఠపు

ఈనాడు, అమరావతి: ప్రాథమిక పాఠశాలల్ని నిట్టనిలువునా చీల్చడం దేశంలోనే కాదు.. ప్రపంచంలోనూ ఎక్కడ జరగని వింత అని ‘ఆరు రకాల స్కూళ్లు ఎవరి కోసం- ఎందుకోసం’ అనే పుస్తకంలో ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం విమర్శించారు. విద్యా వికాస వేదిక తరఫున తరగతుల విలీనంపై పుస్తకాన్ని తీసుకొచ్చారు. ‘ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడా ప్రాథమిక, ఉన్నత తరగతుల పిల్లలకు బడి ఒకే దూరంలో ఉండొచ్చన్న విధానం లేదు. మూడో తరగతి నుంచి సబ్జెక్టు టీచర్లు బోధిస్తారని, వారికి నాణ్యమైన విద్య లభిస్తుందని ప్రభుత్వం ఒక వాదన తెస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడా ప్రాథమిక దశలో సబ్జెక్టు టీచర్లు బోధించడం లేదు. పిల్లల అవసరాల్ని, సామర్థ్యాల్ని దృష్టిలో ఉంచుకొనే ఉపాధ్యాయ శిక్షణ, అర్హతల్లోనూ రెండు రకాలు కోర్సులు ఉన్నాయి. ప్రాథమిక పాఠశాలల్లో సమస్యలను పరిష్కరించడం మాని వాటిని మొత్తానికి లేకుండా చేస్తున్నారు. మా పరిశీలన ప్రకారం విలీనమైన 90శాతం పాఠశాలల్లో అదనపు తరగతి గదులు అందుబాటులో లేవు. విచిత్రమేమిటంటే ‘నాడు-నేడు’ రెండో దశలోనూ వాటికి గదులను మంజూరు చేయలేదు’ అని పుస్తకంలో తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని