కేసీఆర్‌ రైతులను మోసం చేశారు: షర్మిల

ముఖ్యమంత్రి కేసీఆర్‌ రుణమాఫీ అంటూ రైతులను మోసం చేశారని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ధ్వజమెత్తారు. ఆమె చేపట్టిన పాదయాత్ర ఆదివారం ఉదయం నారాయణపేట జిల్లా మద్దూరు మండలం నుంచి

Published : 15 Aug 2022 05:39 IST

దామరగిద్ద, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి కేసీఆర్‌ రుణమాఫీ అంటూ రైతులను మోసం చేశారని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ధ్వజమెత్తారు. ఆమె చేపట్టిన పాదయాత్ర ఆదివారం ఉదయం నారాయణపేట జిల్లా మద్దూరు మండలం నుంచి బయలుదేరి దామరగిద్ద మండలంలోకి ప్రవేశించింది. అయ్యవారిపల్లి, దేశాయిపల్లి, ముస్తాపేట్‌, క్యాతన్‌పల్లి, బాపన్‌పల్లి మీదుగా 16 కిలోమీటర్లు నడిచి సాయంత్రం  దామరగిద్ద చేరుకున్నారు. దారి పొడవునా రైతులు, ప్రజలను పలకరిస్తూ.. వారి సమస్యలు తెలుసుకున్నారు. క్యాతన్‌పల్లి, బాపన్‌పల్లి గ్రామాల్లో ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్‌ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు అమ్ముడు పోయారని ఆరోపించారు. ప్రజలు ఆశీర్వదిస్తే తెలంగాణలో మళ్లీ వైఎస్సార్‌ పాలన వస్తుందని అన్నారు. ఇంట్లో ఎంత మంది వృద్ధులు ఉంటే అంతమందికి రూ.3 వేలు పింఛను, మహిళల పేరుమీద పక్కాఇల్లు ఇస్తామని, భారీగా ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

తెరాస నిరసన: దామరగిద్దలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద వైఎస్‌ షర్మిల పాదయాత్రకు తెరాస నాయకులు నిరసన తెలిపారు. షర్మిల గోబ్యాక్‌ అంటూ  నినాదాలు చేశారు. ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాలను తరలించుకు పోవడంపై సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని