కశ్మీర్‌ కాంగ్రెస్‌ ప్రచార కమిటీ ఛైర్మన్‌ పదవి వద్దన్న ఆజాద్‌!

కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌లో కాంగ్రెస్‌ పార్టీ సంస్థాగతంగా భారీ మార్పులు చేపట్టింది. మాజీ ముఖ్యమంత్రి, సీనియర్‌ నేత గులామ్‌ నబీ ఆజాద్‌కు సన్నిహితుడైన వికార్‌ రసూల్‌ వానీ.. ప్రదేశ్‌ కాంగ్రెస్‌

Published : 17 Aug 2022 05:59 IST

దిల్లీ/జమ్మూ: కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌లో కాంగ్రెస్‌ పార్టీ సంస్థాగతంగా భారీ మార్పులు చేపట్టింది. మాజీ ముఖ్యమంత్రి, సీనియర్‌ నేత గులామ్‌ నబీ ఆజాద్‌కు సన్నిహితుడైన వికార్‌ రసూల్‌ వానీ.. ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ప్రచార కమిటీ ఛైర్మన్‌గా ఆజాద్‌ను నియమించినప్పటికీ ఆయన ఆ పదవిని తిరస్కరించినట్లు తెలుస్తోంది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా రమన్‌ భల్లా, ప్రచార కమిటీ ఉపాధ్యక్షుడిగా తారిక్‌ హమిద్‌ను అధ్యక్షురాలు సోనియగాంధీ నియమించారు. రాజకీయ వ్యవహారాల కమిటీ, సమన్వయ కమిటీ, ప్రణాళిక కమిటీ, క్రమశిక్షణ కమిటీ, ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ తదితరాలను కూడా మంగళవారం ప్రకటించారు. హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న పవన్‌ కాజల్‌ను ఆ పదవి నుంచి తొలగించారు. ఆయన స్థానంలో చందర్‌ కుమార్‌ను నియమించినట్లు పార్టీ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని