కొవ్వూరు అర్బన్‌ బ్యాంకు ఎన్నికల రద్దుపై హైకోర్టు తీర్పు సీఎంకు చెంపపెట్టు

కొవ్వూరు కో-ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకు ఎన్నికల రద్దుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి చెంపపెట్టులాంటిదని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు.

Updated : 31 Aug 2022 06:06 IST

తెదేపా అధినేత చంద్రబాబునాయుడు

ఈనాడు, అమరావతి: కొవ్వూరు కో-ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకు ఎన్నికల రద్దుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి చెంపపెట్టులాంటిదని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన కొవ్వూరు అర్బన్‌ బ్యాంకు ఎన్నికలను ప్రభుత్వం రద్దు చేసి ఎన్నికల వ్యవస్థను అపహాస్యం చేసిందని మంగళవారం ఆయన ట్వీట్‌ చేశారు. ‘బ్యాంకు పాలకవర్గం స్థానంలో ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ చట్టవిరుద్ధమని హైకోర్టు తీర్పు ద్వారా స్పష్టమైంది. వ్యక్తులు తప్పు చేస్తే సరిదిద్దాల్సిన అధికార వ్యవస్థలను సైతం జగన్‌ భ్రష్టుపట్టించారు. న్యాయబద్ధంగా జరిగిన ఏ ఎన్నికల ఫలితాన్ని అంగీకరించేందుకు సీఎం సిద్ధంగా లేరని మళ్లీ రుజువైంది. అయితే... తన పంతమే ఫైనల్‌ కాదని.. న్యాయ వ్యవస్థ ఉందని జగన్‌రెడ్డి గుర్తించాలి. ఇప్పటికైనా చట్టాలకు లోబడి పనిచేయడం నేర్చుకోవాలి’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని