కుప్పం తెదేపా నాయకుల విడుదల

చిత్తూరు జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న కుప్పం నియోజకవర్గ తెదేపా నాయకులకు బెయిలు లభించి శనివారం సాయంత్రం విడుదలయ్యారు. మాజీ ఎమ్మెల్సీ

Published : 25 Sep 2022 04:59 IST

జైలు వద్ద ఉమ్మడి జిల్లా శ్రేణుల అపూర్వ స్వాగతం

ర్యాలీకి అనుమతి లేదని అడ్డుకున్న పోలీసులు

చిత్తూరు (జిల్లా పంచాయతీ), న్యూస్‌టుడే: చిత్తూరు జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న కుప్పం నియోజకవర్గ తెదేపా నాయకులకు బెయిలు లభించి శనివారం సాయంత్రం విడుదలయ్యారు. మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, కుప్పం అర్బన్‌ తెదేపా అధ్యక్షుడు రాజ్‌కుమార్‌, నాయకులు మునస్వామి, మంజునాథ్‌, ఆర్‌.ఎస్‌.మణి, మునెప్ప, సుబ్రహ్మణ్యం, ముఖేష్‌ విడుదలైన వారిలో ఉన్నారు. వారికి మాజీ మంత్రి ఎన్‌.అమరనాథరెడ్డి, ఎమ్మెల్సీ బి.ఎన్‌.రాజసింహులు, చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు పులివర్తి నాని ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా నాయకులు, కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు. బాణసంచా పేల్చారు. వాహనాల్లో కుప్పం వరకు ర్యాలీగా వెళ్లాలని తెదేపా శ్రేణులు భావించి గిరింపేటలోని జైలు వద్ద నుంచి బయలుదేరారు. అప్పటికే కాజూరు కూడలిలో బారికేడ్లు అడ్డు పెట్టిన పోలీసులు ర్యాలీకి అనుమతి లేదని చెప్పారు. రెండు, మూడు వాహనాల్లో మాత్రమే వెళ్లాలని అడ్డుకోవడంతో పోలీసులతో తెదేపా నేతలు వాగ్వాదానికి దిగారు. పోలీసులు ససేమిరా అనడంతో ర్యాలీ కాజూరు వరకు వచ్చి నిలిచింది. అక్కడినుంచి కొద్ది వాహనాలపైనే నాయకులు కుప్పం వెళ్లారు. వారికి బంగారుపాళ్యం, పలమనేరుతోపాటు దారిలో ఘనస్వాగతం లభించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని