రేవంత్‌రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలి: తమ్మినేని

విధానాలే ప్రాతిపదికగా పని చేస్తున్న కమ్యూనిస్టులపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చెత్తవాగుడు మానుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సూచించారు. నోరు

Published : 26 Sep 2022 04:11 IST

ఈనాడు, హైదరాబాద్‌: విధానాలే ప్రాతిపదికగా పని చేస్తున్న కమ్యూనిస్టులపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చెత్తవాగుడు మానుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సూచించారు. నోరు అదుపులో పెట్టుకోవాలని ఆయనకు హెచ్చరించారు. భాజపా ప్రమాదాన్ని గుర్తించి కమ్యూనిస్టులపై రేవంత్‌రెడ్డి బురద చల్లడం మానుకోవాలన్నారు. తెరాస అధినేతకు అమ్ముడుపోయారంటూ ఆయన నోరు పారేసుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. మునుగోడు ఉప ఎన్నికలో మతోన్మాద భాజపాని ఓడించాలనే లక్ష్యంతో కమ్యూనిస్టు పార్టీలు ముందుకు వెళ్తున్నాయని పేర్కొన్నారు. భాజపాను నిలువరించడం, ఓడించడం ప్రధాన లక్ష్యంగా ఎంచుకోకుండా తెరాసను లక్ష్యంగా చేసుకోవడం కాంగ్రెస్‌ పార్టీకే నష్టమని వీరభద్రం తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని